రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు

విజయనగరం జిల్లా పొగిరి సమీపంలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. పాలఖండ్యాం నుంచి వస్తున్న ఆటోను వెనుక నుంచి మినీ వ్యాన్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు గాయాలు కాగా, స్థానికులు వారిని రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.