VIDEO: విద్యార్ధిపై ర్యాగింగ్.. చర్యలు తీసుకోవాలని డిమాండ్..!
KMM: పాల్వంచ మైనార్టీ గురుకుల పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిపై సహచర విద్యార్థులు తాము చెప్పిన పని చేయట్లేదని ర్యాగింగ్ చేయడంతో తలకు గాయం అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ దాడిలో చేయికి కూడా బలమైన గాయం అయిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రిన్సిపల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.