'అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికి సంక్షేమ పథకాలు'

MBNR: రాజాపూర్ మండల కేంద్రంలో నూతన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసి, రూ. 30 లక్షలతో వేస్తున్న సీసీ రోడ్, అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వానికి పేదల సంక్షేమమే ప్రథమ కర్తవ్యమని, అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.