లింగబసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

లింగబసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

BHNG: బీబీనగర్ మండలం పడమటిసోమారంలో గ‌ల‌ శ్రీ లింగబసవేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు బుధ‌వారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది. ఉదయం 11 గంటలకు దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ సందిగారి బస్వయ్య, ఈవో నరేందర్ రెడ్డి సమక్షంలో వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.