కావలిలో వింత శబ్దాలతో పరుగులు తీసిన ప్రజలు

NLR: కావలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసునూరు ఆటోనగర్ సమీపంలో మాగుంట పార్వతమ్మ లేఔట్లో పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సుమారు ఐదు నిమిషాల పాటు ఈ శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. శబ్దాలు ఆగిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.