పెట్టుబడులే లక్ష్యంగా భారత్‌కు ఆఫ్ఘాన్ ఆఫర్లు
తమ దేశంలో పెట్టుబడులే లక్ష్యంగా భారత్‌కు ఆఫ్ఘనిస్తాన్ వరుస ఆఫర్లు ఇస్తుంది. బంగారం తవ్వకంతో సహా కొత్త రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఐదేళ్ల పాటు పన్ను మినహాయింపు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆఫ్ఘాన్ మంత్రి అజీజీ వెల్లడించారు. పెట్టుబడుల కోసం యంత్రాలను దిగుమతి చేసుకునే భారతీయ కంపెనీలకు 1 శాతం సుంకం మాత్రమే విధిస్తామని చెప్పారు.