పాక్ కాల్పుల్లో భారత మహిళ మృతి

పాక్ కాల్పుల్లో భారత మహిళ మృతి

బారాముల్లాలోని ఉరీ సెక్టార్‌లో కాల్పులకు తెగబడుతున్న పాక్ సైన్యం ఓ భారత పౌరురాలిని పొట్టనబెట్టుకుంది. మరికొందరు ప్రజలు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఓ జవాన్ కూడా ఉన్నారు. అటు రాజౌరీ, అఖ్నూర్, జమ్మూ, కుప్వారా జిల్లాల్లో పాక్ కాల్పులు జరుపుతోంది. దీంతో వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు, అధికారులు ఆయా జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.