ముంబై నుంచి దుబాయ్ విమానం.. రెండు సార్లు వెనక్కి!

ముంబై నుంచి దుబాయ్ విమానం.. రెండు సార్లు వెనక్కి!

గగనతలంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ముంబై నుంచి బయలుదేరిన ఎమిరేట్స్ విమానం ఒమన్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు గగనతలం మూసి ఉండటంతో వెనక్కి తిరిగింది. ఆ తర్వాత మళ్లీ ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినా.. పరిస్థితులు అనుకూలించక రెండోసారి కూడా వెనక్కి తిరిగింది. అనంతరం సురక్షితంగా ల్యాండ్ అయిందని ఫ్లైట్ రాడార్ డేటా వెల్లడించింది.