ఈదురుగాలులతో రాలిపోయిన మామిడికాయలు

ఈదురుగాలులతో రాలిపోయిన మామిడికాయలు

MDK: తూప్రాన్ మండలంలో సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఉద్యాన శాఖ పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు మామిడి తోటల్లో మామిడికాయలు భారీగా రాలిపోయాయి. కూరగాయల తోటలు సైతం కొంతమేర దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. పెరిగే దిశలో ఉన్న మామిడికాయలు పెద్ద ఎత్తున రాలిపోయినట్లు రైతులు వాపోయారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.