రైతులకు పశువుల దాణా పంపిణీ చేసిన అధికారులు
GNTR: ఫిరంగిపురం మండలంలోని 113 తాళ్లూరు, ఫిరంగిపురం గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వాసంతి పంటల్లో విత్తన శుద్ధి, ఎరువుల సమర్థ యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. 113 తాళ్లూరు గ్రామంలో పశువుల దాణా 50 శాతం సబ్సిడీపై లబ్ధిదారులకు పంపిణీ చేశారు.