తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే
E.G: రాజమండ్రిలోని వెంకటేశ్వర నగర్‌లో నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్‌ను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. సుమారు 2.90 కోట్ల వ్యయంతో ఓవర్ హెడ్ ట్యాంక్‌ను నిర్మించినట్లు వెల్లడించారు. నగరంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.