అంగన్వాడి కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
JGL: మహిళ, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో రెండు అంగన్వాడీ కేంద్రాలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజా గౌడ్, జిల్లా సంక్షేమ అధికారి డా. నరేష్, సీడీపీవో మమత, మాజీ మున్సిపల్ ఛైర్మన్ గిరి నాగభూషణం, అడువాల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.