ఘనంగా పోలీసు సంస్మరణ దినోత్సవం

ఘనంగా పోలీసు సంస్మరణ దినోత్సవం

కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో మంగళవారం రోజున బీజేపీ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినంను ఘనంగా నిర్వహించారు. దివంగత మాజీ డీఐజీ వ్యాస్, మాజీ ఎస్పీ ఉమేశ్‌ చంద్ర, పోలీసు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గాంధారి శ్రీనివాస్, మల్యాల మారుతి, కాసోజి ప్రతాప్, రాకేష్, రవి, రవీందర్, సురేష్, సిధార్థ, నవదీశ్ పాల్గొన్నారు.