మిట్స్ వర్సిటీలో ఘనంగా శ్రీ రామానుజన్ జయంతి
అన్నమయ్య: అంగళ్లు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి వర్సిటీ రిజిస్టర్, విభాగాధిపతులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రామానుజాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.