'ఐకమత్యంతోనే ఆలయాల అభివృద్ధి సులభతరం'
E.G: గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో ఉంటే ఆలయాల అభివృద్ధి సులభతరం అవుతుందని అహోబిల రామానుజ జీయర్ స్వామి అన్నారు. ఆదివారం గోకవరం మండలంలోని గుమ్మళ్ళదొడ్డి గ్రామంలోని శ్రీరామగిరి క్షేత్రంపై నూతనంగా నిర్మించిన పుష్కరిణి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన రహదారి నుంచి జీయర్ స్వామిని శ్రీరామగిరి వద్దకు స్వాగతం పలికారు.