'వృషకర్మ' గ్లింప్స్ రిలీజ్
'తండేల్' సక్సెస్ తర్వాత నాగచైతన్య నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ 'వృషకర్మ'. కార్తీక్ దండు దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గ్లింప్స్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో చైతూ 'అర్జున్' అనే నిధి అన్వేషకుడిగా సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది.