'జైలర్ 2'పై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో జైలర్ 2 వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ పూర్తయిందని రజనీకాంత్ తెలిపాడు. ప్రస్తుతం చివరి దశ పనులు జరుగుతున్నాయని వెల్లడించాడు. అతి త్వరలోనే నిర్మాణ సంస్థ అధికారికంగా విడుదల తేదీని ప్రకటిస్తుందని స్పష్టం చేశాడు. కాగా ఇందులో మోహన్ లాల్, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు.