రాష్ట్ర పండుగగా సత్య సాయిబాబా జన్మదిన వేడుకలు: కలెక్టర్

రాష్ట్ర పండుగగా సత్య సాయిబాబా జన్మదిన వేడుకలు: కలెక్టర్

కోనసీమ: పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను ఆదివారం అధికారికంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాలు, కలెక్టరేట్ వద్ద సత్య సాయి బాబా జన్మదిన వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని సూచించారు.