నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

NTR: చందర్లపాడు మండలం కోనయపాలెం గ్రామంలో, నంబుల వల్లవరాజు కుమారుడి వివాహ వేడుకకు కూటమినేతలతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హజరయ్యారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులతో కలసి నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వాసిరెడ్డి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.