CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. సోమవారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో 58 మందికి రూ. 50,46,511లను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చెక్కులు అందచేశారు. 21 నెలల్లో సీఎం సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలో 1,268 మందికి రూ.10,40,48,895 సహాయం అందచేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో యువనాయకులు మండలి వెంకట్రామ్ పాల్గొన్నారు.