2వ స్థానం సాధించిన బాలారం ఏకలవ్య మోడల్ పాఠశాల విద్యార్థులు
ASR: ఇటీవల విజయవాడలో నిర్వహించిన జాతీయ సాంస్కృతిక కార్యక్రమం ఉద్భవ్-2025లో కొయ్యూరు మండలం బాలారం ఏకలవ్య మోడల్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరచారు. జాతీయ స్థాయిలో విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతానికి 2వ స్థానం లభించిందని ప్రిన్సిపాల్ డా. సతీష్ కుమార్ తెలిపారు. సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.