ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరికలు
NGKL: తెలకపల్లి మండలం గోలగుండం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేసాని నరేందర్ రావు, సురేందర్ రావు, మాధవరం సంతోష్ రావుతో పాటు పలువురు కార్యకర్తలు గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సమక్షంలో వారు కండువా కప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులైనట్లు వారు తెలిపారు.