భూ కబ్జాపై చిట్యాల గ్రామస్తుల ఆందోళన

భూ కబ్జాపై చిట్యాల గ్రామస్తుల ఆందోళన

నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో భూ కబ్జాకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని సర్వే నం.28/7, 28/8 లో 2.20ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక వ్యక్తి నకిలీ పత్రాలతో కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు.గ్రామ అవసరాల కోసం ఈ భూమిని కాపాడాలని కోరుతూ బైఠాయించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, న్యాయం జరగకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.