రామాయంపేట పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

రామాయంపేట పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

MDK: జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మంగళవారం రామాయంపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులు పరిశీలించారు. ఇప్పటివరకు నమోదైన కేసులను త్వర త్వరగా విచారణ చేపట్టాలని సూచించారు. చోరీల నివారణకు, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.