ఆత్మకూరులో ఈ నెల 12న జాబ్ మేళా
NDL: ఆత్మకూరులోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఈ నెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DSDO శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ మేళాకు 10 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ ఆపై చదివిన 18 నుంచి 30 ఏళ్ల వయసు గలవారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.23 వేల వరకు జీతం ఉంటుందన్నారు.