మహాత్మ బసవ జయంతి సందర్భంగా ఘన నివాళులు
TPT: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ బసవ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మ బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బసవేశ్వరుడు సమానత్వం, న్యాయం, సత్యం కోసం చేసిన సేవలు అమోఘమని, ఆయన బోధనలు సమాజానికి మార్గదర్శకమని తెలిపారు.