విధి నిర్వహణలో పోలీసులు అలసత్వం వహించవద్దు

SDPT: గజ్వేల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నర్సింహులు వార్షిక తనిఖీలో భాగంగా గౌరారం పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం సందర్శించి, పరిసరాలు, సీజ్ చేసిన వాహనాలు, రికార్డులు, సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించారు. సీజ్ చేసిన వాహనాలను త్వరగా యజమానులకు అందించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహించవద్దని సూచించారు.