చురుగ్గా ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వ నమోదు
విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సభ్యత్వ నమోదు ప్రక్రియ అత్యంత చురుగ్గా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధులు గంట్ల శ్రీనుబాబు, నారాయణ్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని స్పష్టం చేశారు.