భోపాల్ బూడిదపై ఆందోళన అవసరం లేదు: మంత్రి
మధ్యప్రదేశ్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో 900 మెట్రిక్ టన్నుల ప్రమాదకర వ్యర్థాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దహనం చేసింది. అయితే దాని వల్ల ఉత్పన్నమైన బూడిదపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై ఆ రాష్ట్ర మంత్రి స్పందించారు. ఈ బూడిదపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కోర్టు మార్గదర్శకాల ప్రకారం దానిని పారవేస్తామని చెప్పారు.