ప్రతి మహిళ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి: ASP
VZM: మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్‌ను ప్రతి మహిళ తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని అదనపు ఎస్పీ పీ. సౌమ్యలత సూచించారు. పోలీస్ పరేడ్‌లో ఏర్పాటు చేసిన శక్తి స్టాల్‌ను ఆదివారం సందర్శించారు. ఆపదలో ఉన్న మహిళలు యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే వారి లొకేషన్ సమీప పోలీస్ స్టేషన్‌కు చేరుతుందని తెలిపారు.