సీజ్ చేసిన ఇసుక మాయం

MDK: తూప్రాన్ మండలం కిష్టాపూర్ శివారులో అక్రమ ఇసుక ఫిల్టర్ల వద్ద సీజ్ చేసిన ఇసుక మాయమైంది. శుక్రవారం తూప్రాన్ ఎస్ఐ శివానందం, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు చేసి ఇసుకను సీజ్ చేశారు. సోమవారం ఇసుకను వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. తీరా వేలం వేసే సమయానికి ఇసుక మాయమైంది. ఈ విషయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.