VIDEO: ఎచ్చెర్లలలో కురుస్తున్న భారీ వర్షాలు

SKLM: ఎచ్చెర్ల మండలంలోని పలు గ్రామాలలో సోమవారం సాయంత్రం గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షానికి ఉద్యోగులు, కూలీలు, ఇతరులు ఇబ్బందులు పడ్డారు. పని ముగించుకొని ఇంటికి వెళుతున్న తరుణంలో ఈ వర్షం పడడంతో ఇబ్బందులు తలెత్తాయని అంటున్నారు. రైతులకు ఈ వర్షం ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యవసాయ నిపుణులు పేర్కొన్నారు. జీడి, మామిడి రైతులకు నష్టం ఉంటుందన్నారు.