వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ తనిఖీ
ADB: వార్షిక తనిఖీలో భాగంగా ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం తనిఖీ చేశారు. సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన, నీతి, నిజాయితీ, చురుకుదనం పాటించాలన్నారు. పట్టణంలో నేరాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ సునీల్ ఉన్నారు.