ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయండి..!

మేడ్చల్: బోడుప్పల్ కమిషనర్ శైలజా ఆధ్వర్యంలో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, హెల్త్, హైడ్రా అధికారులతో అత్యవసర సమావేశం జరిగింది. నీటి ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు, ప్రజలకు అవగాహన, ప్రమాద ప్రాంతాల గుర్తింపు, రక్షణ బృందాల సిద్ధం వంటి అంశాలు చర్చించారు. కార్యాలయంలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నంబర్ 040-27215959కు కాల్ చేయాలన్నారు.