అంబానీ కంపెనీల్లో సీబీఐ సోదాలు

బ్యాంక్ రుణాల ఎగవేత ఆరోపణలపై ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కాం) కార్యాలయాలపై సీబీఐ సోదాలు నిర్వహించింది. రూ.2,000 కోట్లకు పైగా మోసం జరిగినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. గతంలో ఈడీ ఇదే కేసులో అంబానీని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీకి చెందిన నివాసాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు.