PGRS అర్జీపై అధికారులు విచారణ

PGRS అర్జీపై అధికారులు విచారణ

AKP: కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కోటవురట్లకు చెందిన ఏ. అప్పారావు అందజేసిన అర్జీపై మండల అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. కోటవురట్ల జంక్షన్‌లో తన ఇంటి స్థలాన్ని అధికారులు కుదించడంతో అవస్థలు పడుతున్నట్లు అప్పారావు అర్జీలో పేర్కొన్నాడు. దీనిపై డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు, కార్యదర్శి రఘురాం విచారణ నిర్వహించారు.