తెనాలిలో రూపుదిద్దుకున్న వడ్డే ఓబన్న భారీ కాంస్య విగ్రహం
GNTR: స్వాతంత్య్ర సమరయోధుడు, ఉయ్యాల నరసింహారెడ్డి సైన్యాధ్యక్షుడు వడ్డే ఓబన్న భారీ కాంస్య విగ్రహం తెనాలి సూర్య శిల్పశాలలో రూపుదిద్దుకుంది. అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద 2026 జనవరి 11న ఆయన జయంతి రోజు ప్రతిష్టించేందుకు, నిర్వాహకుల కోరిక మేరకు తాము విగ్రహాన్ని తయారు చేశామని శనివారం కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తెలిపారు.