VIDEO: మియాపూర్‌లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. వాహనాలు దగ్దం
HYD: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి హఫీజ్‌పేట్ మార్తాండనగర్‌లో అర్ధరాత్రి భారీ విద్యుత్ ప్రమాదం జరిగింది. హెవీ లోడ్ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు చెలరేగి, పక్కనే ఉన్న ఒక టాటా ఏసీ, రెండు బైకులు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో ప్రాణనష్టం తప్పింది.