BREAKING: ఫలించిన చర్చలు

ప్రొడ్యూసర్లు-ఫెడరేషన్ మధ్య వివాదానికి శుభం కార్డు పడింది. తెలంగాణ ప్రభుత్వ జోక్యంతో ఎట్టకేలకు సినీ కార్మికుల వివాదం కొలిక్కి వచ్చింది. దీంతో 18 రోజుల గ్యాప్ తర్వాత రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు పున: ప్రారంభం కానున్నాయి. అయితే కండీషన్లు, డిమాండ్లు, రాజీ వ్యవహారాలపై కాసేపట్లో సంయుక్త ప్రకటన చేయనున్నారు.