'పన్నులు చెల్లించి అభివృద్ధికి తోడ్పడండి'
MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో ఆస్తి పన్నుపై 5% డిస్కౌంట్ ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను మొత్తాన్ని ఇంటి యజమానులు ఏప్రిల్ 30, 2026 వరకు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పడాలని, ఆన్‌లైన్, మున్సిపల్ బిల్ కలెక్టర్లుకు తమ ఇంటి పన్నులు చెల్లించి రషీదు పొందాలని కోరారు.