సమయానికి తెరుచుకొని బస్కి సచివాలయం

సమయానికి తెరుచుకొని బస్కి సచివాలయం

ASR: అరకులోయ పరిధిలోని బస్కి గ్రామ పంచాయతీ సచివాలయం సిబ్బంది సమయానికి హాజరు కావడంలేదని ప్రజలు గురువారం ఆవేదన వ్యక్తంచేశారు. ఉదయం 11 గంటల సమయంలో కూడా సచివాలయం మూసి ఉంటుందని, తమ అవసరానికి వచ్చి పడిగాపు కాయవలసి వస్తుందన్నారు. అధికారులు సచివాలయం సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.