'పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి'

BDK: ఇల్లందు మున్సిపాలిటీలోని ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ డి.వెంకటేశ్వర్లు అన్నారు. నేడు పలు వార్డులలో పర్యటించి ప్రజలతో మాట్లాడుతూ.. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే మున్సిపల్ సిబ్బందితో ప్రజలు కలిసి సహకరిస్తూ శుభ్రత పాటించాలని ఆయన తెలిపారు. పరిశుభ్రతతోనే అంటువ్యాధులు అరికట్టవచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు.