రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం
KDP: జిల్లాలో రోడ్డు భద్రతపై కడప వన్‌టౌన్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సీఐ చిన్న పెద్దయ్య, ఎస్.ఐ అమర్‌నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రాజారెడ్డి వీధిలో ఈ కార్యక్రమం జరిగింది. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు.