హైకోర్టులో ఏబీఎన్‌కు షాక్‌

హైకోర్టులో ఏబీఎన్‌కు షాక్‌

విశాఖలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఏబీఎన్ పబ్లికేషన్‌కు ఉచితంగా కేటాయించిన అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఈ కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం, ఏ చట్టం ప్రకారం ప్రైవేటు సంస్థకు భూమి ఇచ్చారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది.