జాబ్ మేళాలో 91 మందికి ఉద్యోగాలు
GNTR: తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాలో 91 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు తెలిపారు. మొత్తం 301 మంది అభ్యర్థులు హాజరు కాగా, ఎంపికైన పలువురికి సీఆర్డీఏ అదనపు కమిషనర్ సురేష్ సాయి ప్రవీణ్, ఆయా కంపెనీల హెచ్ఆర్ విభాగ ప్రతినిధులతో కలిసి ఆఫర్ లెటర్లను అందజేశారు.