టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే
ప్రకాశం: టీడీపీ అనుబంధ కమిటీలలో నియమితులైన వారు బాధ్యతగా పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. కనిగిరి టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షునిగా నియమితులైన సెట్ జంషీద్ అహమ్మద్‌ను సోమవారం ఎమ్మెల్యే అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.