కరెంట్ షాక్‌తో ప్రైవేట్ టెక్నీషియన్ మృతి

ప్రకాశం: పేరాల జక్కావారి వీధిలో విద్యుత్ పోల్ పై పనిచేస్తూ కరెంట్ షాక్ కొట్టడంతో సునీల్ అనే ప్రైవేట్ లైన్ మెన్ శనివారం సాయంత్రం మృతి చెందాడు. ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న సునీల్ విద్యుత్ స్తంభం ఎక్కి పనిచేస్తుండగా షాక్ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్ పనులు జరుగుతున్నప్పటికీ సరఫరా ఆపకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.