డిసెంబర్ 5న మెగా పేరెంట్స్, టీచర్ మీట్ 3.0: కలెక్టర్

డిసెంబర్ 5న మెగా పేరెంట్స్, టీచర్ మీట్ 3.0: కలెక్టర్

కోనసీమ: డిసెంబర్ 5వ తేదీన మెగా పేరెంట్, టీచర్ మీట్ 3.0 ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పని చేసేందుకు ఈ మీట్ గొప్ప అవకాశం అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు షెడ్యూల్ ప్రకారం విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.