BREAKING: టీమిండియా ఓటమి
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 213 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ బ్యాటర్లలో తిలక్ వర్మ(62)తో రాణించాడు. జితేష్ శర్మ(27), అక్షర్ పటేల్(21) హార్దిక్(20) పర్వాలేదనిపించారు. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమమైంది.