VIDEO: ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు

VIDEO: ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు

సత్యసాయి: ధర్మవరం పట్టణ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించి, పోలీస్ శాఖకు సహకరించాలని ట్రాఫిక్ ఎస్సై ఎస్. వెంకట రాముడు సూచించారు. శుక్రవారం ఆయన పోలీసు సిబ్బందితో కలిసి పట్టణంలో పర్యటించి, ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారే వాహనాలు నడపాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని స్పష్టం చేశారు.